ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ అప్పుడే..!?

Saturday, June 20th, 2020, 02:48:07 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ నుంచి మాత్రం కనీసం అంటే కనీసం చిన్న అప్డేట్ కూడా ఇవ్వకపోతుండడంతో వారిపై ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

కానీ ఈ చిత్రంపై మాత్రం గత కొన్నాళ్ల నుంచి విపరీతమైన బజ్ వినిపిస్తూనే ఉంది. అదే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విషయంలో. ఎప్పటి నుంచి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రభాస్ ఫ్యాన్స్ కు అందని ద్రాక్ష పండులానే మిగిలిపోయింది.

కానీ ఇప్పుడు వారికి గుడ్ టైం స్టార్ట్ అయ్యినట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ తర్వాత వారంలోనే విడుదల కానున్నట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు ఈ మూడో వారంలో అని బజ్ వినిపించింది అలాగే ఇప్పుడు అదే వారంలో ఈ ఫస్ట్ లుక్ రానున్నట్టుగా సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.