లేడీ రోబోట్ స్ట‌న్నింగ్ లుక్

Thursday, November 1st, 2018, 11:01:56 PM IST

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2.ఓ చిత్రం అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ని నవంబ‌ర్ 3న రిలీజ్ చేస్తుండ‌డంతో అంద‌రిలో ఒక‌టే ఉత్కంఠ‌. ఈలోగానే ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌చార హోరు మొద‌లైంది. ఈ దీపావ‌ళి కానుక‌గా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్, శంక‌ర్, అక్ష‌య్ వంటి వాళ్లు ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్నారు. 2.ఓ చిత్రాన్ని భారీగా హిట్ చేయాల‌న్న‌దే వీళ్ల ధ్యేయం.

ఈ చిత్రంలో ర‌జ‌నీ, అక్కీకి ఏమాత్రం తీసిపోని పాత్ర‌లో ఎమీజాక్స‌న్ న‌టించింది. ఈ అమ్మ‌డు త‌న‌వంతుగా ప్ర‌మోష‌న‌ల్ సాయం చేస్తోంది. తాజాగా ఎమీ రోబోటిక్ అప్పియ‌రెన్స్ లో ఉన్న ఫోటో ఒక‌టి రివీలైంది. ఈ ఫోటోలో ఎమీ ఫెంటాస్టిక్‌గా క‌నిపిస్తోంది. నిజంగానే రోబోకి ప్రాణం పోస్తే, అది ఎమీలా మారిందా? అన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఈ చిత్రంలో ఎమీజాక్స‌న్ బ్యాడీగా న‌టిస్తోందా? లేక పాజిటివ్ రోల్ చేస్తుందా? అన్న‌ది ట్రైల‌ర్ వ‌చ్చాక తెలుస్తుందేమో?

  •  
  •  
  •  
  •  

Comments