పుష్ప తర్వాత బన్నీ చేసే సినిమా అదే?

Friday, June 11th, 2021, 11:25:23 AM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం లో నటిస్తున్నారు. పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ గా కనిపిస్తున్నారు. అయితే సినిమా కోసం ఎంతకైనా కష్టపడే అల్లు అర్జున్, వరుస సినిమా లతో అభిమానులను అలరించేందుకు సిద్దం అవుతున్నారు. అయితే బన్నీ చేస్తున్న పుష్ప చిత్రం రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం పాన్ ఇండియా తరహాలో విడుదల అవుతుండటం తో తర్వాత సినిమా ల పై కూడా బన్నీ ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. అయితే వేణు శ్రీరామ్ దర్శకత్వం లో ఐకాన్ మూవీ చేయాల్సి ఉంది. అయితే పుష్ప చిత్రం తర్వాత బన్నీ ఈ చిత్రం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే పుష్ప మరియు ఐకాన్ ల తర్వాత బన్నీ మురుగదాస్ తో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాక బోయపాటి శ్రీను మరియు కొరటాల శివ దర్శకత్వం లో కూడా బన్నీ నటించనున్నారు. అయితే వరుస సినిమా లతో బన్నీ టాలీవుడ్ లో స్ట్రాంగ్ ప్లేస్ లో ఉన్నారు.