స్టైలిష్ స్టార్ ఖాతాలో మరోసారి “ఊర మాస్” రికార్డ్.!

Sunday, June 2nd, 2019, 10:10:22 PM IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లోని ఒక సరికొత్త యాంగిల్ ను పరిచయం చేసిన దర్శకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను అనే చెప్పాలి.అప్పటి వరకు స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ను “సరైనోడు” అనే సినిమాతో “ఊర మాస్” అనిపించేలా చేసేసారు.ఈ సినిమాకు బన్నీ అభిమానుల్లో చాలా మంది కల్ట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారని చెప్పాలి.అలాగే బన్నీకి నార్త్ లో ఏ పాటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.అతని సినిమాలు సునాయాసంగా 100 మిలియన్ మార్కును హిందీ డబ్బింగ్ లో అందుకుంటాయి.బన్నీ సినిమాలను వారు అంత ఎక్కువగా ఆదరిస్తారు.ఇది వరకు ఒకసారి సరైనోడు హిందీ వెర్షన్ యూట్యూబ్ లో సాలిడ్ రికార్డులను నెలకొల్పింది.

అప్పట్లోనే ఈ చిత్రానికి 200 మిలియన్ వ్యూస్ మరియు 5 లక్షల లైక్స్ కూడా సంపాదించుకుంది.కానీ అప్పుడు ఆ పూర్తి సినిమాను యూట్యూబ్ నుంచి తొలగించేసారు.కానీ ఆ తర్వాత మళ్ళీ పెట్టగా అదే జోరు చూపించింది ఈ సినిమా.ఈ సారి పెట్టిన ఒక సంవత్సరం పూర్తవ్వకముందే 170 మిలియన్ వ్యూస్ మరియు మళ్ళీ 500K(5 లక్షల) లైక్స్ ను సంపాదించి సరికొత్త రికార్డు సృష్టించింది.దీనితో బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా ఎన్ని సార్లు తీసి పెట్టినా సరే ఇదే రికార్డులు నమోదు అవుతాయి అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.రకుల్ ప్రీత్ సింగ్ మరియు క్యాథరీన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించారు.