లేటెస్ట్ బజ్ : మరో బ్లాక్ బస్టర్ దర్శకునితో బన్నీ.?

Sunday, May 24th, 2020, 04:36:07 PM IST


ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంతో మొట్ట మొదటి సారిగా బన్నీ బాలీవుడ్ లో అడుగు పెట్టనుండడంతో తనకి ఎలాంటి వెల్కమ్ దక్కుతుందో అని బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే నిజానికి దీనికంటే ముందు ఎప్పుడో అనుకున్న “ఐకాన్” చిత్రంతో బన్నీ బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తారు అనుకుంటే పుష్ప తో కాస్త ముందుగానే అడుగు పెట్టనున్నారని కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇప్పుడు ఈ రెండు సినిమాల అనంతరం మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో బన్నీ సినిమా చేయనున్నారని ఇప్పుడు సమాచారం.

అతను మరెవరో కాదు అపజయమే ఎరుగని బాల బస్టర్ దర్శకుడు కొరటాల శివ. ఆయనతో బన్నీ ఈ రెండు చిత్రాలు తర్వాత ఓ సినిమా చేయనున్నారని టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ కాంబో కానీ నిజంగా సెట్టయితే వేరే లెవెల్ అని చెప్పాలి.