నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం – కుమారుడి ఆకస్మిక మృతి

Saturday, May 23rd, 2020, 12:33:25 PM IST

టాలీవుడ్ సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో తీవ్ర పెనువిషాదం చోటు చేసుకుంది. నటి వాణిశ్రీ కి పుత్రశోకం కలిగింది. కాగా గత రాత్రి ఆమె కుమారుడు అభినయన్ వెంకటేశ్ కార్తీక్ తీవ్ర గుండెపోటుతో నిద్రలోనే అకస్మాత్తుగా చనిపోయాడు. కాగా శుక్రవారం రాత్రి అతడు చెన్నైలోని తన నివాసంలో నిద్రలోనే కన్నుమూశారు అని కుటుంబసభ్యులు వెల్లడించారు. కాగా వృత్తిరీత్యా వైద్యుడైనటువంటి అభియన్‌కి భార్య, నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. అతడి భార్య కూడా వైద్య వృత్తిలోనే ఉన్నారు. కాగా మృతుడు అభినయ్ కన్నాళ్లు రామచంద్రన్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. కాగా వాణిశ్రీ కుమారుడి మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, చెన్నైలోని ఆమె ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. కాగా వాణిశ్రీ కి కుమారుడు అభియన్ తోపాటు అనుపమ అనే కుమార్తె ఉన్నారు.