సుజిత్ కి మళ్ళీ అవకాశమిచ్చిన యూవీ క్రియేషన్స్, హీరో ఎవరో తెలుసా?

Friday, November 22nd, 2019, 06:16:03 PM IST

సుజిత్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రన్ రాజా రన్ చిత్రం తో తోలి విజయాన్ని సినీ పరిశ్రమలో నమోదు చేసుకొని, రెండో సినిమాని ప్రభాస్ తో తీసే అవకాశాన్ని పొందాడు. సాహో చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని నిరాశపరిచిన సుజిత్ ప్రతిభ గల దర్శకుడని నమ్మి యూవీ క్రియేషన్స్ మరో అవకాశం ఇచ్చింది. అయితే సాహో చిత్రం దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. ఒక్క హిందీ భాషలో మినహా మిగిలిన అన్ని బాషలలో ప్లాప్ అయిన విషయం అందరికి తెలిసిందే.

అయితే టీనేజ్ వయసునుండే సుజిత్ సినిమా లపై ఎంతో ఆసక్తి చూపేవాడు. షార్ట్ ఫిలిమ్స్ సొంతగా నిర్మించి, దర్శకత్వం వహించాడు. అయితే అదే ఉత్సాహంతో శర్వానంద్ తో చిత్రాన్ని తీసి హిట్ కొట్టాడు. ఇపుడు అదే బ్యానర్ లో మరో సినిమా అవకాశం రావడం తో శర్వానంద్ తోనే సుజిత్ మూడవ చిత్రం ఉండబోతుందని సమాచారం. ఇప్పటివరకు పలు చర్చలు జరగగా ఇంకా ఈ విషయం ఫై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. అయితే యూవీ క్రియేషన్ ఈ చిత్రానికి సంబందించిన అధికారిక ప్రకటన ఎపుడు వెలువరిస్తుందో చూడాలి.