సుకుమార్ రెమ్యునరేషన్ డబుల్!

Monday, April 23rd, 2018, 10:20:44 PM IST


రంగస్థలం సినిమాతో రీసెంట్ గా హిట్ అందుకున్న దర్శకుడు సుకుమార్ ఇప్పుడు స్టార్ దర్శకుల్లో చేరిపోయారు. ఎక్కువ పారితోషికం అందుకుంటున్న వారి లిస్ట్ లో ఆయన పేరు కూడా చేరిపోయింది. ప్రస్తుతం కొరటాల శివ -త్రివిక్రమ్ లాంటి వారు 15 కోట్లలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇప్పుడు వారికంటే కొంచెం ఎక్కువగానే సుక్కుకు అందుతున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం సినిమా మీడియం బడ్జెట్ లో వచ్చి నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.

దీంతో మైత్రి మూవీ మేకర్స్ వారు నెక్స్ట్ సినిమా కూడా ఆయనతోనే చేయాలనీ ఫిక్స్ అయ్యారు. మహేష్ వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ తరువాత సుకుమార్ దర్శకత్వంలోనే సినిమా చేయనున్నాడు. ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ ఆ విషయాన్ని అధికారికంగా తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం సుకుమార్ కి దాదాపు 15 కోట్లకు పైగానే పారితోషికం అందుకున్నారట. అంతే ఇంతకుముందు రంగస్థలం సినిమాకు ఇచ్చిన దానితో పోలిస్తే ఇది ఎక్కువని తెలుస్తోంది. మరి ఆ సినిమా ద్వారా సుకుమార్ నిర్మాతలకు ఎంత లాభాన్ని అందిస్తాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments