సవ్యసాచి ట్రైల‌ర్.. డైరెక్ట‌ర్ సుకుమార్ మైండ్‌బ్లోయింగ కామెంట్స్‌..!

Thursday, October 25th, 2018, 01:16:54 PM IST

టాలీవుడ్‌లో ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక‌ప్పుడు ఎక్కువ‌గా క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు అంటే.. మూడు ఫైట్లు, నాలుగు సెంటిమెంట్ సీన్లు, ఆరుపాట‌లు, ఇలా లెక్క‌లు వేసుకుని మరీ చిత్రాల‌ను తెర‌కెక్కించేవారు. అయితే ఇటీవ‌ల ఆ ట్రెండ్‌కు శుభం ప‌లికింది టాలీవుడ్. దీంతో మంచి క‌థా బ‌ల‌మున్న‌చిత్రాలు, వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాలు మ‌న తెలుగులో కూడా వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి, నీదీ నాదీ ఒకేటే క‌థ‌, రంగ‌స్థ‌లం మ‌రికొన్ని చిత్రాలు వ‌చ్చి తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి.

అయితే తాజాగా మ‌రో డిఫ‌రెంట్ జాన‌ర్‌తోనే టాలీవుడ్‌లో మ‌రో చిత్రం వ‌స్తోంది. అక్కినేని నాగ చైత‌న్య- చందూమొండేటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం స‌వ్య‌సాచి. డిఫ‌రెంట్ ప్లాట్‌తో వ‌స్తున్న చిత్రం స‌వ్య‌సాచి. ఇటీవ‌ల ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల అయ్యింది. దీంతో స‌వ్య‌సాచి ట్రైల‌ర్ చూసిన సుకుమార్ చిత్ర యూనిట్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. ఈ చిత్రం పై సుక్కు స్పందిస్తూ.. ఇండియ‌న్ స్క్రీన్ మీద ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి కాన్సెప్ట్ రాలేద‌ని.. ఏ ద‌ర్శ‌కుడు అయినా ఇలాంటి డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో సినిమాల‌ని తీయాల‌నుకుంటాడ‌ని.. అయి తాను తీయ‌లేక పోయినందుకు చాలా అసూయ‌గా ఉంద‌ని సుకుమార్ సెన్షేష‌న్ కామెంట్ చేశారు. దీంతో ఈ జీనియ‌స్ డైరెక్టర్ నుండి ఊహించ‌ని కాంప్లిమెంట్ రావ‌డంతో స‌వ్య‌సాచి చిత్ర యూనిట్ ఆనందంలో మునిగితేలుతుంది. మ‌రి టీజ‌ర్, ట్రైల‌ర్ల‌తో అంచ‌నాల‌ని పెంచేసిన ఈ చిత్రం ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments