ఇది కదా చిరు ఫ్యాన్స్ కి కావాల్సిన ఎమోషన్..!

Tuesday, November 19th, 2019, 09:47:30 PM IST

సైరా చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివతో తన 152వ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే..ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుకున్న ఈ చిత్రానికి సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా సరే అది మంచి హాట్ టాపిక్ గానే మారుతుంది.అయితే ఇప్పుడు మాత్రం ముఖ్యంగా చిరు అభిమానులకు ఒక రేంజ్ లో కిక్కిచ్చే వార్త బయటకు వచ్చింది.

ఎన్నో అంచనాల నడుమ తెరక్కనున్న ఈ చిత్రానికి సంగీతం ఎవరు అందించాలి అన్న అంశం చిత్ర యూనిట్ కు సవాల్ గా మారింది.మొదట్లో అంతా దేవిశ్రీయే అని అనుకున్నా చివరకు కాదని తేలిపోయింది.అలాగే ఈ చిత్రానికి కూడా ఓ బాలీవుడ్ సంగీత దర్శకున్ని పెట్టుకోబోతున్నారు అని కూడా టాక్ వచ్చింది.కానీ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ చిత్రానికి ఓ సంచలన సంగీత దర్శకుడు లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో మరపురాని ఆల్బమ్స్ ను ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చిరు కోసమేనా అన్నట్టుగా ప్రాణం పెట్టి ఇచ్చే మణిశర్మ ను తీసుకున్నట్టు ఇప్పుడు సినీ వర్గాల నుంచి సమాచారం.చిత్ర యూనిట్ కూడా ఈ విషయాన్ని ఖరారు చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది.ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే మెగాభిమానులకు పట్టరాని ఆనందం.

అన్నయ్య పల్స్ కి తగ్గట్టుగా ఎలా సంగీతం ఇవ్వాలో అవసరం అయితే తన చిత్రానికి ఆడియో తానే డబ్బులు పెట్టి మరీ చేస్తానన్న మణిశర్మ ఏ స్థాయిలో ఈ చిత్రానికి సంగీతం అందిస్తారో చూడాలి.ఈ ఇద్దరి కాంబో పడి ఎన్నో ఏళ్ళు దాటేసింది.ఇప్పుడు ఆ ఆకలి తీర్చుకొనే సమయం ఫ్యాన్స్ కు వచ్చింది.ఇక ఇంత కంటే కావాల్సిన ఎమోషన్ ఇంకోటి ఏదన్నా ఉంటుందా మెగా ఫ్యాన్స్.?