ఉత్తమ నటుడిగా సూపర్ స్టార్…

Saturday, September 21st, 2019, 12:20:56 AM IST

శుక్రవారం నాడు హైదరాబాద్ లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల కార్యక్రమం జరిగింది. కాగా భారతీయ చలన చిత్ర పితామహుడిగా పేరు తెచుకున్నటువంటి దాదాసాహెబ్ ఫాల్కే 150 జయంతి సందర్భంగా ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ను హైదరాబాద్ లో చాలా ఘనంగా నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటులు, సాంకేతిక విభాగానికి చెందిన కొందరు నిపుణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కాగా ఈమేరకు మాట్లాడిన తెలంగాణ గవర్నర్ తెలుగు చిత్రసీమ కోసం ఎంతో గొప్పగా మాట్లాడారు.

ఇకపోతే ఈ అవార్డుల ప్రదానోత్సవం లో భాగంగా తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్‌ అనే నేను’ చిత్రానికి సంబంధించి ఉత్తమ నటుడు అవార్డును దక్కించుకున్నాడు. కాగా ఈ అవార్డును తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా మహేష్ బాబు భార్య నమ్రత స్వీకరించారు. అంతేకాకుండా సీనియర్ నటుడు మోహన్ బాబు కి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించారు. కాగా ఈ కార్యక్రమానికి తెలుగు చిత్ర సీమ కు చెందిన వారు చాలా మంది పాల్గొన్నారు.