హాట్ టాపిక్: వకీల్ సాబ్ పై సూపర్ స్టార్ ప్రశంసలు

Sunday, April 11th, 2021, 10:27:27 AM IST

మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ తెరపై కనిపించారు. వకీల్ సాబ్ తో వెండితెర పై కనువిందు చేస్తున్న పవన్ సరికొత్త చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా పై ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా చిత్రాన్ని వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు వకీల్ సాబ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ టాప్ ఫామ్ లో కొనసాగుతున్నారు అని అన్నారు. చాలా పవర్ ఫుల్ నటన తో వకీల్ సాబ్ లో కనిపించారు అని చెప్పుకొచ్చారు. మూడేళ్ల తర్వాత చేసిన సినిమా తో ఇంత ప్రేక్షకాదరణ పొందటం పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. ప్రకాష్ రాజ్ నటన చాలా బ్రిలియంట్ గా ఉందని పేర్కొన్నారు.

అయితే ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటించిన అంజలి, నివేథా థామస్, అనన్య లు హృదయాన్ని హత్తుకునే విధంగా నటన కనబరిచారు అని అన్నారు. అయితే థమన్ అందించిన సంగీతం వకీల్ సాబ్ ను మరొక స్థాయిలో నిలబెట్టింది అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అదే విధంగా దర్శకుడు వేణు శ్రీ రామ్, శృతి హాసన్, దిల్ రాజ్ లతో పాటుగా చిత్ర యూనిట్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అయితే వేణు శ్రీరామ్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా పై సర్వత్రా బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ రావడం తో ప్రముఖులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.