కాలా విషయంలో క్లారిటీ వచ్చినట్టే ?

Friday, April 6th, 2018, 03:35:59 AM IST


సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కాలా. కబాలి తరువాత పా రంజిత్ – రజని ల కాంబినేషన్ లో వస్తున్నా ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాలో రజని కాంత్ మాఫియా డాన్ గా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ యూ / ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఇదివరకే ఏప్రిల్ 27న విడుదల చేయాలనీ పోస్టర్స్ కూడా వేశారు .. కానీ ఆ తరువాత విడుదల విషయంలో సమస్య రావడం, ఇంకొన్ని కార్యక్రమాలు మిగిలి ఉండడంతో అనుకున్న డేట్ రోజున వస్తుందా లేదా అన్న సందేహాలు ఉండేవి. తాజాగా సెన్సార్ పూర్తీ కావడంతో ఈ సినిమా విడుదల విషయంలో క్లారిటీ రానుంది.

  •  
  •  
  •  
  •  

Comments