సూపర్ స్టార్ సినిమాలు మానేస్తున్నాడా ?

Tuesday, September 25th, 2018, 05:00:15 PM IST

సూపర్ స్టార్ రజని కాంత్ సినిమాలు మానేస్తున్నాడా ? అన్న ప్రశ్న ఇప్పుడు కోలీవుడ్ లో సంచలనం రేపుతోంది. రజని కాంత్ ఇంత సడన్ గా సినిమాలు ఎందుకు మానేస్తున్నాడన్నది ఇప్పుడు అర్థం కానీ ప్రశ్న. అయినా రజని కాంత్ ఎందుకు సినిమాలు మానేయాలని అనుకుంటుంన్నాడు అంటూ రకరకాల ప్రశ్నలు రజని అభిమానుల్లో తలెత్తుతున్నాయి. అసలు ఎందుకీ ప్రశ్న ? అంటే సూపర్ స్టార్ రజని కాంత్ నటిస్తున్న రోబో 2. 0 సినిమా నవంబర్ లో విడుదల కానుంది. దాంతో పాటు అయన నటిస్తున్న పెట్ట సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా తరువాత రజని, క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పాడు. ఇప్పటికే కథ విని ఓకే చెప్పినట్టు టాక్. అయితే రజని కాంత్ కు ఇది 166 వ సినిమా. ఈ సినిమా తరువాత అయన సినిమాలు మానేయాలని అనుకుంటున్నాడని రజని సన్నిహితుల నుండి సమాచారం వచ్చింది. దానికి కారణం , రజని ఈ మద్యే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ ఓ కొత్త పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాలకే టైం కేటాయించి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట. అది విషయం.