వీడియో : సుర‌య సంపేత్తోందిగా..

Sunday, October 28th, 2018, 11:51:49 AM IST

`ధూమ్ 3`లో మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ స‌ర్క‌స్ కంపెనీలో త‌న‌దైన విన్యాసాల‌తో క‌ట్టిప‌డేసింది క‌త్రిన‌. మెరుపుతీగ విన్యాసాల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచింది. అథ్లెటిక్ దేహ‌శిరుల‌తో కుర్రాళ్ల గుండెల్లో ఇప్ప‌టికీ సెగ‌లు రేపుతోంది ఈ బ్యూటీ. ఇటీవ‌లే స‌ల్మాన్ స‌ర‌స‌న న‌టించిన టైగ‌ర్ జిందా హై అంతే బంప‌ర్ హిట్ కొట్ట‌డం వెన‌క క‌త్రిన‌కు క్రిటిక్స్ పెద్ద రేంజులోనే మార్కులేశారు. అందుకే ఈ భామ న‌టించిన `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్, అమితాబ్‌ల‌కు ధీటుగా క‌త్రిన అదిరిపోయే పాత్ర‌లో న‌టిస్తోంది.

సుర‌య అనే డ్యాన్స‌ర్ పాత్ర‌లో వేడెక్కించ‌బోతోంది. తెర ఆద్యంతం క‌త్రిన డ్యాన్సింగ్ మెరుపుల‌తో మ‌తి చెడ‌డం ఖాయ‌మ‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే ఈ సినిమాకి ఇండియ‌న్ మైఖేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా కొరియోగ్ర‌ఫీ అందించారు. ఇదివ‌ర‌కూ సాంగ్ మేకింగ్ వీడియో ఆక‌ట్టుకుంది. ఇప్పుడు తాజాగా క‌త్రిన డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియోని లైవ్‌లోకి రిలీజ్ చేశారు. ఈ వీడియోలో క‌త్రిన శ్ర‌మ గుండెల్ని పిండేస్తోంది. క‌త్రిన డ్యాన్స్ ప్రాక్టీస్ ఆద్యంతం ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే సాగింద‌ని ఈ వీడియో చూస్తే అర్థ‌మ‌వుతోంది.థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 8న రిలీజ‌వుతోంది. క‌త్రిన ట్యాలెంట్ మ‌రోసారి థియేట‌ర్ల‌లో వీక్షించే వీలుంది. రెండు వారాలు ఆగాలంతే.