ప్రపంచ స్థాయిలో “హిరణ్యకసిప”..!

Tuesday, November 6th, 2018, 04:48:05 PM IST

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్, భల్లాల దేవ రానా కంబినేషన్ లో హిరణ్యకసిప చిత్రం ఉంటుందని ప్రకటించి చాలా కాలం అయింది. ఇపుడు ఆ సినిమా ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు కారణం ఆ సినిమా పై గుణశేఖర్ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు, అపుడెపుడో రానా ప్రధాన పాత్రలో హిరణ్యకసిప సినిమా ఉంటుందని, ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అని వార్తలొచ్చాయి, మళ్లి ఇంతవరకు ఆ ఊసే లేదు. దీంతో ఈ సినిమా అసలు ఉంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇపుడు ఇదే ప్రశ్న నిర్మాత సురేష్ బాబును విలేఖరులు అడిగారు. అదుగో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయనను విలేఖరులు హిరణ్యకసిప సినిమా గురించి అడుగగా సమాధానంగా అభిమానులు ఉబ్బి తబ్బిబ్బయ్యే వార్త చెప్పారు, ఈ సినిమా కోసం చాలా మంది పని చేస్తున్నారు, అటు గుణశేఖర్ ఆఫీస్ లో దీనికి సంబంధించి పని జరుగుతుంది, ఇటు రామానాయుడు స్టూడియోలో కొంత మంది పని చేస్తున్నారు, లండన్ ఆఫీస్ లో కూడా ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ సినిమా ఇండియా లెవెల్లో, వరల్డ్ స్టాండర్డ్స్ లో నిర్మించబోతున్నాం అని చెప్పారు. ఈ సినిమాకు నిర్మాత, నటుడు, ప్రొడక్షన్, అన్ని రానా నే అని చెప్పారు. రానాకు వీఎఫెక్స్ బేస్డ్ సినిమాలంటే ఇష్టం అని, అమర్ చిత్ర కథ పుస్తకాలూ బాగా చదువుతుంటారు అని చెప్పారు. అందుకే రానా టెక్నికల్లి బెస్ట్ సినిమాల్లో నటించడానికే ఇష్టపడుతుంటారని అన్నారు.

నిజానికి ఈ సినిమా మొదట్లో అన్ని భాషల్లో రోపొందించే ఆలోచన లేదని, తరవాత దానికి తగ్గట్టు బడ్జెట్ కేటాయించాము అన్నారు, ఇది ఒక్క తెలుగు బాషా చిత్రం లా కాకుండా అన్ని భాషల మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని తీస్తునన్నాం అందుకే ఇంట పెద్ద కాన్వాస్ పై తీస్తున్నాం అన్నారు. వీఎఫెక్స్ బేస్డ్ సినిమా కాబట్టి ఎక్కువ సమయం పట్టచ్చని బావించచ్చు. ఇదివరకే రానా- గుణశేఖర్ ల బృందం హిరణ్యకసిప టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments