స్టార్ మా లో సూర్య సినిమాకు డేట్ వచ్చేసింది.!

Thursday, June 18th, 2020, 05:30:11 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ఎన్ జి కె(నంద గోపాల కృష్ణన్). అక్కడి విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామా అక్కడ తమిళ్ తో పాటుగా మన తెలుగులో కూడా విడుదలయింది. కానీ ఊహించిన స్థాయి విజయాన్ని అయితే ఈ చిత్రం అందుకోలేకపోయింది.

సాయి పల్లవి మరియు రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లు గా నటించారు. అయితే ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా అతి త్వరలోనే టెలికాస్ట్ చేయనున్నట్టు తెలిపారు.కానీ ఇప్పుడు ఈ చిత్రం టెలికాస్ట్ కు ఓ డేట్ వచ్చింది. వచ్చే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ చిత్రం టెలికాస్ట్ అవ్వనుంది. మరి ఈ చిత్రాన్ని కనుక అప్పుడు మిస్సయ్యి ఉంటే ఈసారి ఓసారి చూడొచ్చు.