హాట్ టాపిక్: సూపర్ స్టార్ కృష్ణ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మనవడు!

Monday, June 1st, 2020, 10:40:04 AM IST

సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సర్కారు వారి పాట అంటూ తన నెక్స్ట్ సినిమా కి సంబంధించిన టైటిల్ నీ రివీల్ చేస్తూ మాస్ లుక్ లో ఫ్యాన్స్ కి అడ్డిరిపోయే ట్రీట్ ఇచ్చారు.అయితే సూపర్ స్టార్ కృష్ణ కి తన మనవడు గల్లా అశోక్ సూపర్ గిఫ్ట్ ను ఇచ్చారు.

గల్లా జయదేవ్ కుమారుడు అయిన గల్లా అశోక్ తన తాత సూపర్ స్టార్ కృష్ణ కి పుట్టిన రోజున ఒక వీడియో విడుదల చేసి అందరినీ సర్ప్రైజ్ కి గురి చేశారు.సూపర్ స్టార్ కృష్ణ పాటలలో జుంబరే జుజుంబరే పాట కి ఎనలేని క్రేజ్ ఉంది. యమలీల చిత్రం లోని ఈ పాట ఇప్పటికీ కూడా ఫేమస్.ఈ పాటకి సంబంధించిన టీజర్ ను ఆదివారం నాడు విడుదల చేయగా విపరీతంగా ఈ వీడియో వైరల్ అవుతుంది. అశోక్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. ఈ చిత్రం సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కృష్ణ అభిమానులు మాత్రం ఈ వీడియో ను తెగ వైరల్ చేస్తున్నారు. ఈ పాటకి రీమిక్స్ సాంగ్ రావడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ కృష్ణ అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున కృష్ణ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.