మై గాడ్..ఆ వీడియోలో ఉంది శ్వేతా బసేనా !!

Monday, September 19th, 2016, 03:15:29 PM IST

swetha-bas
శ్వేతా బసు .. ఈ పేరు వినగానే ఆమె చేసిన సినిమాలకంటే కూడా ఆమె వివాదాలతో ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. దాంతో ఆమెకు టాలీవుడ్ లో సినిమాలు కరువయ్యాయి, ఓ కేసు విషయం లో ఆమె ఇమేజ్ డామేజ్ అయ్యింది. ఇక్కడ లాభంలేదని బాలీవుడ్లోకి వెళ్లి అక్కడ ఓ దర్శకుడి దగ్గర స్క్రిప్ట్ సహాయకురాలిగా పనిచేసింది. అయితే హిందీలో సినిమాల్లో చేయాలనీ అనుకున్న శ్వేతా కు ఓ టివి సీరియల్ లో ఛాన్స్ దక్కింది. ”డర్ సబ్కో లగ్తా హై” పేరుతొ రుపొండుతున్న టివి సీరియల్ లో ఆమె నటిస్తుంది. లేటెస్ట్ గా శ్వేతా బసు వీడియొ ఒకటి విడుదలై సంచలనం రేపుతోంది. అస్సలు ఆ వీడియొ లో ఉన్నది శ్వేతా బసేనా అంటూ షాక్ అవుతున్నారు జనాలు ? వీడియొ అనగానే .. మీరు ఇంకో ఆలోచనలోకి వెళ్లిపోకండి ..!! అది ఓ టివి సీరియల్ ప్రోమో !! బాలీవుడ్ సంచలన ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ”చంద్ర నందిని” షోది. పాపులర్ టివి ఛానల్ లో ఈ కార్యక్రమమ్ ప్రసారం కానుంది. దానికి ట్రైలర్ ఇది. మహారాణి గా శ్వేతా బసు కనిపించి షాక్ ఇచ్చింది. ఏక్తా కపూర్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సీరియల్ తో శ్వేతా బసు ఫేట్ మారిపోయే ఛాన్స్ దగ్గర్లోనే ఉంది.