పడి లేస్తున్న “సైరా నరసింహా రెడ్డి”.!

Saturday, October 19th, 2019, 08:44:09 PM IST

టాలీవుడ్ లెజెండరీ మెగాస్టార్ చిరంజీవి కథానాయకునిగా ఎందరో అగ్ర తారలు కలయికలో దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా “సైరా నరసింహా రెడ్డి”.ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబడిన ఈ చిత్రం మంచి టాక్ ను సంపాదించుకున్నా సరే ఒక్క తెలుగు మినహా మిగతా చోట్ల మాత్రం ఊహించిన స్థాయి వసూళ్లు రావడం లేదన్న వెలితి తప్ప మెగాభిమానులు ఈ సినిమా విషయంలో మరే ఇతర అంశంలో కూడా నిరాశ చెందలేదు.తెలుగులోనే మొదటి రోజు ఎన్నో రికార్డులకు తెర లేపిన ఈ చిత్రం ఆ తర్వాత రెండు రోజుల్లోనే డల్ అయ్యి మళ్ళీ పుంజుకుంది.

రాంగ్ టైం లో విడుదల కావడం వల్ల ఈ ఎఫెక్ట్ పడిందని చెప్పొచ్చు.అయితే మళ్ళీ వీకెండ్స్ లో మాత్రం సైరా సత్తా చాటుతుంది.తర్వాత మళ్ళీ కాస్త బాక్సాఫీస్ దగ్గర నిలకడ సాధించింది.మళ్ళీ వర్కింగ్ డేస్ వచ్చేసరికి మాత్రం అంతగా రాణించలేకపోతుంది.ఇప్పుడు మళ్ళీ వీకెండ్ కావడంతో చాలా చోట్ల మళ్ళీ ఫుల్స్ పడుతున్నాయి.రేపు కూడా ఎలాగో ఆదివారం కాబట్టి సైరా మరింత ప్లస్ కావచ్చు.మొత్తానికి సైరా మాత్రం వర్కింగ్ డేస్ పడుతుంది వీకెండ్స్ లో లేస్తుంది.ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేకీవెన్ దగ్గరకు ఈ చిత్రం వచ్చింది.మరి ఫుల్ రన్ లో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను ఎంతవరకు తెచ్చి పెడుతుందో చూడాలి.