సైరా చిత్రం మరో బాహుబలి కానుందా? విడుదలకి ముందే భారీ రికార్డులు…

Wednesday, September 18th, 2019, 11:11:44 AM IST

తెలుగు చిత్ర పరి శ్రమలో భారీ సినిమాల నిర్మాణం బాహుబలితో మొదలైన సంగతి అందరికి తెలిసిందే, తెలుగు సినిమా ఘనత ని ప్రపంచ నలువైపులా ఈ చిత్రం చాటి చెప్పింది. బాహుబలి, ఆ తర్వాత సాహో . ఈ ఏడాది వస్తున్న అత్యంత భారీ చిత్రాల్లో సైరా ఒకటి. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించారు.

సినిమాలో పలు కీలక పాత్రల్లో కన్నడ నటుడు సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్నా ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషలలో విడుదలకి సిద్ధంగా వున్నా సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి సంబందించిన శాటిలైట్, డిజిటల్ రైట్స్ విషయంలో సైరా నిర్మాతలు సేఫ్ అయినట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబందించిన శాటిలైట్స్, డిజిటల్ రైట్స్ రూ. 125 కోట్లతో జి తెలుగు దక్కిచుకుందని సమాచారం. ఇంత భారీగా దక్కడం గొప్ప విషయమని చెప్పాలి. తెలుగు థియేట్రికల్ రైట్స్ రూ. 110 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. అంటే ఈ చిత్ర నిర్మాణ వ్యయం దాదాపు సగానికి పైగా వచ్చినట్లే. భారీ తారాగణం, పలు భాషల్లో చిత్రాన్ని తెరకెక్కియ్యడం తో యావత్ భారతావని ఈ చిత్రం కోసం చాల ఆతృతగా ఎదురు చూస్తుంది. సైరా చిత్రం బాహుబలికి దీటుగా శాటిలైట్ , డిజిటల్ రైట్స్ ఉండటం తో ఈ చిత్రం బాహుబలి స్థాయిని అందుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.