సైరా అందుకే వాయిదా అయిందా.. ఇక ఫ్యాన్స్ కి పండగే…

Tuesday, September 17th, 2019, 05:24:09 PM IST

సైరా నరసింహ రెడ్డి చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తెలుగు తో పాటు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలవ్వనుంది. సినిమా కి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి చిత్రం బృందం తాజా ప్రకటన ఇచ్చింది. వాతావరం సంబంధ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండటం తో సైరా ప్రీ రిలీజ్ వేడుకని ఈ నెల 22 కి వాయిదా వేశారు.

ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న సైరా ట్రైలర్ ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడినప్పటికీ, ట్రైలర్ ని మాత్రం సెప్టెంబర్ 18 వ తారీఖునే ఖరారు చేసినట్లు సమాచారం. 170 సెకండ్ల ట్రైలర్ లో ప్రేక్షకుడిని మైమరపించేట్లు వుండనున్నదని సమాచారం. సినిమాలో చిరంజీవి తానే స్వయం గా డూప్ లేకుండా పోరాట సన్నివేశాలు చిత్రీకరించినట్లు మనందరికీ తెలిసిందే. సైరా ట్రైలర్ లో వున్న మరిన్ని విషయాలు తెలియాలంటే వచ్చేదాకా వేచి చూడాల్సిందే.