తమిళంలో సైరా సత్తా తెలిస్తే హౌరా అనాల్సిందే

Wednesday, September 18th, 2019, 09:27:29 AM IST

సాహో తర్వాత తెలుగు నుండి వస్తున్నా మరో భారీ సినిమా “సైరా” దాదాపు 270 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే, అక్టోబర్ 2 న విడుదల కాబోతున్న ఈ సినిమాపై అప్పుడే అంచనాలు స్కై ని టచ్ చేస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా దీనిని తీర్చిదిద్దారు. అందుకు తగ్గట్లే సినిమాకి భారీ స్థాయిలో ప్రమోషన్ చేస్తున్నారు. ఇక సైరాని తమిళ్ లో కూడా భారీస్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు.

సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళు అక్కడ సైరాని రిలీజ్ చేస్తున్నారు. పెద్ద సంస్థ కావటంతో గ్రాండ్ గానే రిలీజ్ చేయటానికి అవకాశం దొరుకుతుంది. దానికి తోడు ఇందులో నయనతార హీరోయిన్ కావటం, అలాగే తమిళ్ సూపర్ స్టార్ గా ఎదుగుతున్న విజయ్ సేతుపతి ఇందులో కీలక పాత్ర చేయటంతో ఈ సినిమాని ఈజీ గా తమిళ్ జనాల్లోకి తీసుకొనిపోవచ్చు. దానికి తోడు ఎలాగూ చిరంజీవికి అక్కడ కొంచం మార్కెట్ ఉండటంతో తమిళంలో సైరాకి మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి.

అక్కడ సైరా గురించి పాజిటివ్ రివ్యూస్ వస్తే మాత్రం భారీ వసూళ్లు సాధించటం ఖాయం. ఎందుకంటే సైరా సినిమాలో తమిళనాడు టాపిక్ కూడా ఉంటుంది. విజయ్ సేతుపతి తమిళ సైన్యం తరుపున బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేయటానికి సైరా నరసింహారెడ్డికి మద్దతు పలుకుతాడు. వాళ్ళకి నాయకుడిగా సేతుపతి నటిస్తున్నాడు. దీనితో తమిళులు కూడా సైరాని ఓన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.