బాలయ్య సంచలన కామెంట్స్ కు తలసాని ఘాటు రిప్లై.!

Thursday, May 28th, 2020, 06:10:08 PM IST


నందమూరి నటసింహం మరియు ప్రముఖ రాజకీయ నాయకుడు బాలకృష్ణ చేసిన లేటెస్ట్ కామెంట్స్ రెండు రాష్ట్రాల సినీ మరియు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇటీవలే షూటింగ్స్ నిమిత్తం తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సహా అక్కడి సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో మెగాస్టార్ చిరంజీవి సహా..

తెలుగు పరిశ్రమ బడా నిర్మాతలు మరియు దర్శకులు కీలక చర్చలు జరిపి షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం తనకు ఎందుకు ఎవరూ తెలియజేయలేదని బాలయ్య మండిపడడం కలకలం రేపుతుంది.

అలాగే తనను మీటింగుకు పిలవకుండా తలసానితో కూర్చొని హైదరాబాద్ లో భూములు పంచుకుంటున్నారా అని అనడం మరింత సంచలనం రేపింది. దీనితో తలసాని కూడా ఘాటు గానే స్పందించారు.

బాలకృష్ణ మాటలకు తాను సంజాయిషి చెప్పుకోదలచుకోలేదని అలాగే ఆయన్ను పిలవడం పిలవకపోవడం సినీ పెద్దల ఇష్టం అని ఎవరు యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళని పిలిచారు అంటూ తలసాని సంచలన కామెంట్స్ చేసారు.