ఆ సినిమాకోసం షాకిస్తున్న తమన్నా రెమ్యూనరేషన్ ?

Saturday, May 19th, 2018, 03:46:57 AM IST

అందాల భామ అవంతికగా బాహుబలితో ఆకట్టుకున్న తమన్నాకు ఆ సినిమా తరువాత అవకాశాలు తగ్గాయి .. కారణం ఎన్నో ఆశలు పెట్టుకున్న అభినేత్రి భారీ పరాజయం కావడమే. దాంతో ఛాన్సులు సన్నగిల్లాయి .. స్టార్ హీరోల సినిమాల్లో అయితే అవకాశాలు రావడం లేదు .. ఇక మీడియాయ్ రేంజ్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్సులయితే వస్తున్నాయి .. కానీ ఆ సినిమాలు చేస్తే తన రేంజ్ పడిపోతుందో అని బయంతో ఒప్పుకోవడం లేదు మిల్కి భామ తమన్నా. ఇక భిన్నమైన సినిమాలు, తనకు నచ్చిన రొమాంటిక్ డ్రామా లు వస్తే చేయడానికి రెడీ అని చెప్పింది .. ఈ నేపథ్యంలో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన నా నువ్వే సినిమాలో జోడి కట్టేసింది. సిద్దార్థ్ హీరోగా వచ్చిన 180 సినిమాతో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న జయేంద్ర దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ ఎన్టీఆర్ టైనర్ గా తెరక్కుతున్న ఈ సినిమాలో తమన్నా నటించేందుకు భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నాదట. అసలే అవకాశాలు లేవని అంటున్నారు.. అందులోను భారీ రెమ్యూనరేషన్ ఎలా సాధ్యం అంటే .. ఈ సినిమాలో తమన్నా తప్ప మారేవారిని దర్శకుడు వుహించుకోలేదట .. అందుకోసం పట్టుబట్టి కాస్త ఖర్చు ఎక్కువైనా సరే ఆమెతో చేయించాడు. ఇంతకీ ఈ సినిమాకు తమన్నా తీసుకున్నా రెమ్యూనరేషన్ ఏంతో తెలుసా .. దాదాపు రెండు కోట్లట !! చెప్పినంత ఇస్తేనే చేస్తానని పట్టు పట్టడంతో అంతా ఇవ్వక కుదరలేదట. ఇందులో ప్రేమకోసం తపించే రేడియో జాకీ పాత్రలో తమన్నా కన్పిస్తుందట . మరి తమన్నా సక్సెస్ ని ఈ సినిమా కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి !!

  •  
  •  
  •  
  •  

Comments