సర్కార్ నూ వదలని పైరసీ భూతం..!

Tuesday, November 6th, 2018, 02:53:02 PM IST

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న సమస్య పైరసీ, అన్ని ఇండస్ట్రీ వర్గాల వారు ఎంత ప్రయత్నించినా పైరసీ కట్టడి చేయలేకపోతున్నారు. హాలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని సినిమాలు పైరసీ బారిన పడుతున్నాయి. ముఖ్యంగా తమిళ సినిమాలు ఈ సమస్య ఎక్కువగా ఉంది. తమిళ్ లో పైరసీ సీట్లు కోకొల్లలుగా ఉన్నాయి, తమిళ్ ఫిలిం అసోసియేషన్ వారు ఎంతో కస్టపడి చాలా వరకు పైరసీ సైట్లను బ్లాక్ చేయగలిగారు, కానీ తమిళ్ రాకర్స్ సైట్ ను మాత్రం అడ్డుకోలేక పోతున్నారు.

తమిళ్ రాకర్స్ సైట్ కొత్త కొత్త సినిమాలను విదూడలైన వెంటనే సైట్లో అప్లోడ్ చేస్తూ మేకర్స్ కు సవాలు విసురుతున్నారు, తాజాగా సర్కార్ సినిమా పై కూడా తమిళ్ రాకర్స్ కన్నేసింది. సర్కార్ HD ప్రింట్ ను థియేటర్లలో విడుదలయ్యే కొన్ని గంటల ముందే సైట్లో అప్లోడ్ చేస్తాం అంటూ తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నిర్మాతలకు సవాల్ విసిరారు. విజయ్ – మురుగదాస్ ల కంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం పై బారి అంచనాలే ఉన్నాయి, కాగా తమిళ్ రాకర్స్ ఇచ్చిన వార్నింగ్ తో సినిమా యూనిట్ లో టెన్షన్ మొదలైంది. అయితే ఆ సైట్ ను డౌన్ చేసి సర్కార్ సినిమాను పైరసీ నుంచి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అది కుదరలేదట. నిర్మాతల సంఘం థియేటర్ల యాజమాన్యాలకు ఇప్పటికే పైరసీ విషయంలో జాగ్రత్త వహించండంటూ అప్రమత్తం చేసిబట్టు తెలుస్తుంది.