ప్రముఖ తమిళనటుడు ఎస్ఎస్ రాజేంద్రన్ మృతి

Friday, October 24th, 2014, 04:15:25 PM IST


ప్రముఖ తమిళ నటుడు ఎస్ఎస్ రాజేంద్రన్ ఈ రోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపతున్న ఎస్ఎస్ రాజేంద్రన్ చెన్నైలోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 86 సంవత్సరాల వయసుకలిగిన ఈ వెటరన్ నటుడు శివాజీ గణేష్, ఎంజీఆర్ లకు సమకాలికుడు. 1952లో పరాశక్తి అనే సినిమాద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. పుంపుహార్, శివగంగై చమై, మనిమగుడమ్, శారద వంటి చిత్రాలలో మంచి పాత్రలను పోషించి అందరి మన్నలను పొందారు. సినిమాలలో నటిస్తూనే.. డీఎంకె పార్టీలో చేరి తమిళనాడు అసెంబ్లీకి కూడా ఎన్నికైన్నారు. కొన్నాళ్ళ అనంతరం.. ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకె పార్టీలో చేరారు. అనారోగ్యం కారణంగా.. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు తమిళ సిని.. రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.