చిరంజీవి, బాలకృష్ణ మధ్య విబేధాలు లేవు.. క్లారిటీ ఇచ్చిన త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ..!

Saturday, May 30th, 2020, 08:28:24 PM IST

లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లకు అనుమతి తీసుకునేందుకై ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కలిసిన సంగతి తెలిసందే. అయితే ఈ సమావేశానికి తనను ఎవరు పిలవలేదని, పేపర్ల ద్వారా ఆ విషయం నాకు తెలిసిందని, సినిమా పరిశ్రమ చర్చల పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకుంటున్నారని హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి.

అయితే బాలయ్య వ్యాఖ్యలను తప్పుపడుతూ మెగా బ్రదర్ నాగబాబు కూడా రెచ్చిపోయారు. దీంతో ఈ వివాదం కాస్త పెరిగి పెద్దదయ్యేలా కనిపించింది. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నాగబాబు, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. బాలకృష్ణ చేయని వ్యాఖ్యలను చేసినట్లు చూపుతున్నారని, అయన వ్యక్తిగత వ్యాఖ్యల గురించి స్పందించనని అన్నారు. చిత్ర పరిశ్రమలో నటులు చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని, వారిద్దరూ మంచి మిత్రులుగా ఉన్నారని అన్నారు.