వీడియో : సీక్రెట్ ల‌వ‌ర్స్‌తో తాప్సీ ఓపెన్‌గానే?

Thursday, March 1st, 2018, 10:17:37 PM IST

ల‌వ్‌లో సీక్రెట్ ఏమీ ఉండ‌దు. దాచాల‌న్నా దాగ‌దు. అది ఆటోమెటిగ్గా ఓపెన్ అయిపోతుందంతే! ఇదిగో ఇక్క‌డ తాప్సీ వ్య‌వ‌హారం అలానే ఉంది. ఒకేసారి ఇద్ద‌రు కుర్రాళ్ల‌తో రొమాన్స్ చేసేస్తోంది. ఒక‌రితో సంబంధం లేకుండా ఇంకొక‌రితో చెట్టు పుట్ట వెంట సాంగేసుకుంటోంది. అస‌లు ఈ డిఫ‌రెంట్ ల‌వ్ ఏంటో అర్థం చేసుకోవాలంటే సినిమానే చూడాలేమో!

దిల్ జానేనా.. అంటూ సాగే ఈ పాట విజువ‌ల్లీ ఫెంటాస్టిక్‌. తాప్సీ లుక్ రియ‌ల్లీ సంథింగ్ స్పెష‌ల్‌గా క‌నిపిస్తోంది. బాబ్డ్ హెయిర్ స్టైల్‌.. అల్ల‌రి చిల్ల‌రి వేషాలు అద్భుతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. తాప్సీ `దిల్ జంగ్లీ` సినిమాలో చేస్తున్న సాహ‌స‌మేంటో కానీ ఇదివ‌ర‌కూ వ‌చ్చ‌న ట్రైల‌ర్ ఎంతో ఆక‌ట్టుకుంది. ఇప్పుడు ఈ పాట అంతే ఎగ్జ‌యిట్‌మెంట్ పెంచుతోంది… తాప్సీ స‌హా స‌కీబ్ స‌లీమ్‌, అభిలాష్‌, నిధి సింగ్‌, శ్రిష్టి శ్రీ‌వాస్త‌వ వంటి యంగ్ ట్యాలెంట్ ఈ చిత్రంలో సంద‌డి చేయ‌బోతోంది. సినిమా రిలీజ్ వ‌ర‌కూ ఈ వీడియో సాంగ్ వీక్షిస్తూ ఆస్వాధించండి..