తాప్సి ఫోకస్ కోలీవుడ్ పై పడిందా ?

Saturday, October 13th, 2018, 01:25:14 PM IST

సొట్టబుగ్గల తాప్సి కి ఈ మధ్య బాలీవుడ్ లో బాగా వర్కవుట్ అయింది. అక్కడ చేసిన సినిమాలు ఈమెకు మంచి నటిగా ఇమేజ్ తెచ్చిపెట్టాయి. సౌత్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్సినా తాప్సి కి దాదాపు ఐదారేళ్ళ సరైన సక్సెస్ అందలేదు .. దాంతో పాటు ఆమెకు అటు గ్లామర్ పరంగా ఇటు.. నటిగా ఎన్నో ప్రయత్నాలు చేసింది ఫలితం మాత్రం సున్నా. దాంతో బాలీవుడ్ కు షిఫ్ట్ అయినా తాప్సి కి పింక్, నామ్ షబానా లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది. అక్కడ మంచి హిట్స్ పడడంతో ఈ అమ్మడికి క్రేజ్ పెరిగింది. అయితే తనకు గ్లామర్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోవాలన్న ఆలోచన మాత్రం పోలేదు .. అందుకోసమే ఆ దిశగా మళ్ళీ సౌత్ పై ఫోకస్ పెట్టింది. తాజాగా కోలీవుడ్ లో సినిమా చేయాలన్న ఆలోచనలో ఉందట. ఇప్పటికే గేమ్ ఓవర్ అంటూ ఓ సినిమా చేస్తుంది. దాంతో పాటు తమిళంలో మరో రెండు మూడు సినిమాల ఆఫర్స్ ఉన్నాయట. సో ఈ దెబ్బతో తాప్సి కి గ్లామర్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకునే అవకాశం వచ్చిందన్నమాట.