షాకింగ్ వీడియో : తార‌క్ త‌ల‌కిందులు!?

Saturday, March 3rd, 2018, 11:34:48 PM IST

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ మూవీలో చాలా స‌ర్‌ప్రైజ్‌లే ఉంటాయ‌ని ఆదినుంచి ప్ర‌చారం సాగుతోంది. ఈ సినిమా క‌థాంశం నుంచి ప్ర‌తిదీ ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకుని త్రివిక్ర‌ముడు ప‌ని చేస్తున్నార‌న్న వార్త అంత‌కంత‌కు వేడి పెంచుతోంది. ఇందులో తార‌క్ ఆర్మీ అధికారిగా న‌టిస్తాడ‌ని .. అందుకోసం లుక్ మార్చుకునేందుకు అత‌డు ఇప్ప‌టికే భీక‌రంగా క‌స‌ర‌త్తులు చేస్తున్నాడ‌ని ప్ర‌చార‌మైంది.

తార‌క్ రూపురేఖ‌లు ఆద్యంతం మార్చేస్తున్నాడు. మునుప‌టి కంటే యంగ్‌గా స్ట‌న్నింగ్ లుక్‌తో ఆక‌ట్టుకుంటాడ‌ని చెబుతున్నారు. అందుకోసం ఏకంగా బాలీవుడ్‌లో హృతిక్ రోష‌న్‌, ర‌ణ‌వీర్ సింగ్ లాంటి హీరోలకు ఫిట్‌నెస్‌లో శిక్ష‌ణ‌నిచ్చిన లాయ్డ్ ను బ‌రిలో దించార‌న్న ప్ర‌చారం ఉంది. అనుకున్న‌ట్టే ఆయ‌న దిగారు. తార‌క్‌కి శిక్ష‌ణ‌ను ప్రారంభించారు. లేటెస్టుగా ట్విట్ట‌ర్‌లో ఓ వీడియోని పోస్ట్ చేసిన లాయ్డ్ ఆస‌క్తిక‌ర కామెంట్ పెట్టారు. “మేం ఇంకా ఆ ప‌ని పూర్తి చేయ‌లేదు.. @తార‌క్ 9999 .. జూ.ఎన్టీఆర్ # బీస్ట్‌“ అని ట్వీట్ చేశాడు. దీనిని బ‌ట్టి తార‌క్‌ని ఓ బీస్ట్‌లా త‌యారు చేస్తాడా? అందుకేనా ఇలా త‌ల‌కిందులుగా తార‌క్ భీక‌రంగా క‌స‌ర‌త్తు మొద‌లెట్టాడు? మీరే ఈ వీడియో చూసి చెప్పండి.