నన్ను బెదిరించిన ప్రతి ఒక్కరికీ పోలీసులే సమాధానం చెబుతారు – తరుణ్ భాస్కర్!

Wednesday, July 1st, 2020, 02:08:42 PM IST

తాజాగా తరుణ్ భాస్కర్ ఒక మలయాళ సినిమా పై ప్రశంసల వర్షం కురిపిస్తూ, పలు వ్యాఖ్యలు చేశారు. అయితే చేసిన వ్యాఖ్యలు కాస్త మన తెలుగు కమర్షియల్ సినిమా పై సెటైర్స్ వేసినట్లుగా అనిపించాయి. హీరో పిచొడిలా గట్టిగా అరవదు, ప్రతి డైలాగ్ ను స్మార్ట్ గా చెప్పడు, ప్రతి రెండు నిమిషాలకు హీరో రే ఎంట్రీ ఉండదు, అంతేకాక చివరగా సైనికుల గురించో, దేశం గురించో మెసేజ్ ఉండదు, మరి దీన్ని కూడా సినిమా అంటారా అని వ్యాఖ్యానించారు.

అయితే తాను పెట్టిన ఆ పోస్ట్ కి తాము అన్వయించి కొని, కొందరు ట్రోల్ చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు.అయితే తనను టార్గెట్ చేసి దూషించిన వారిని సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా విషయం గురించి వివరించారు.అంతేకాక తనకు వచ్చిన ఫోన్ కాల్స్ రికార్డింగ్స్, ఫోన్ నంబర్ లని జత చేసినట్లు వివరించారు. అంతేకాక చివరగా తనను బెదిరించిన ప్రతి ఒక్కరికీ పోలీసులే సమాధానం చెబుతారు అని తరుణ్ భాస్కర్ పేర్కొన్నారు.

అయితే తరుణ భాస్కర్ చేసిన వ్యాఖ్యల పై మహేష్ బాబు అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో జనతా గ్యారేజి విషయం లో కూడా తరుణ్ భాస్కర్ ఇలాంటి పరిస్తితి ఎదుర్కొన్నారు. అయితే అపుడెం వాటిని పట్టించుకొలేదు. తాజాగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం తో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.