అర్జున్ రెడ్డికి ఇది గట్టి పరీక్షే..చావో రేవో..తేలిపోతుంది.!

Friday, November 16th, 2018, 03:49:43 AM IST

టాలీవుడ్ సంచలన హీరోల్లో విజయ్ సాయి దేవరకొండ కూడా ఒకరు, అతి తక్కువ సినిమాలతోనే ఎనలేని క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు.వివాదాలు మరియు పైరసీ వంటివి ఎన్నో చుట్టుముట్టినా సరే వాటికి ధీటుగానే నిలబడ్డాడు.కానీ ప్రస్తుతం మాత్రం మన అర్జున్ రెడ్డికి కాస్త గడ్డు కాలమే నడుస్తుంది అని చెప్పాలి.గీతా గోవిందం భారీ విజయాన్ని అందించినా ఆ తర్వాత ఎన్నో అంచనాల నడుమ వచ్చిన చిత్రం “నోటా” చిత్రం మాత్రం ఘోరమైన ప్లాప్ గా నిలిచిపోయింది.అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన తన చిత్రం “టాక్సీవాలా”కు ఇప్పుడు ఆ ప్రభావం అంతగా తగులుతుంది అని చెప్పకపోయినా సరే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకోబోతుంది అన్న విషయం మాత్రం చర్చనీయాంశం అయ్యింది.

సినిమా బాగుంటే పర్వాలేదు కానీ ఏ మాత్రం టాక్ అటు ఇటుగా వచ్చినా సరే విజయ్ కు గట్టి దెబ్బే తగులుతుందని చెప్పాలి,ఇప్పటికే విజయ్ మీద ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం ఇంత ఓవర్ యాక్షన్ పనికి రాదు అని విజయ్ ఇలాగే ఉంటే ఎంతో మంది కనుమరుగయిపోయిన హీరోల జాబితాలోకి భవిష్యత్తులో చేరిపోవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.అయినా సరే విజయ్ మాత్రం ఎప్పుడు తగ్గలేదు తాను ఏంటో మార్చుకోలేదు.ఎప్పుడు కొత్తదనాన్ని అందించడానికే ప్రయత్నిస్తూ వస్తున్నాడు మరి ఇప్పుడు రాబోతున్న ”టాక్సీవాలా” చిత్రం విజయ్ ను ఏ స్థానంలో ఉంచుతుందో వేచి చూద్దాం.