ఓవర్ సీస్ లో టాక్సీవాలా హావా ?

Thursday, October 25th, 2018, 07:00:27 PM IST

టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ హీరోగా ఓ రేంజ్ ఇమేజ్ అందుకున్న విజయ్ దేవరకొండ సినిమా అంటేనే హాట్ కేక్ లా మారింది. అర్జున్ రెడ్డి అంటే అదో యూత్ వల్ల హిట్టయిందిలే అన్నవాళ్ళు ఉన్నారు .. మరి తాజాగా గీత గోవిందం తో అటు ఫ్యామిలీ ప్రేక్షకులను టెంప్ట్ చేసాడు. సో ప్రస్తుతం ఆయన నటిస్తున్న టాక్సీ వాలా వచ్చే నెల 16న విడుదల చేస్తున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు .. గీత ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఓవెర్సెస్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయట .

ప్రస్తుతం విజయ్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో భారీ పోటిమధ్య ఈ సినిమా హక్కులను ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలిమ్స్ సొంతంచేసుకుంది. నిజానికి విజయ్ నటించిన నోటా సినిమా ఫలితం తారుమారవడంతో టాక్సీ వాలా విషయంలో మేకర్స్ కొంత టెన్షన్ పడ్డారు .. కానీ విజయ్ ఇమేజ్ దృష్ట్యా ఆ క్రేజ్ అలాగే ఉంది కాబట్టి .. టాక్సీ వాలా విషయంలో టెన్షన్ పడొద్దన్న విషయాన్నీ ఈ ఓవర్ సీస్ హక్కులను చేస్తే తెలుస్తుంది. నవంబర్ 15న అమెరికాలో ప్రీమియర్స్ ప్లాన్ చేసారు. మరి ఈ ఇసినిమా విడుదలకు ముందే కొంత సినిమా లీక్ అవ్వడంతో రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నది సస్పెన్స్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments