`తేజ్ .. ఐ ల‌వ్ యు` ఫిక్సేన‌ట‌!

Wednesday, April 4th, 2018, 11:32:39 PM IST

సాయిధ‌ర‌మ్ సినిమాకి టైటిల్ క్రైసిస్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ర‌క‌ర‌కాల టైటిల్స్ వినిపించాయి. `దేవుడు వ‌ర‌మందిస్తే` , `అంద‌మైన చంద‌మామ‌` అనే టైటిల్స్ వినిపించాయి. అయితే ఇవేవీ ఫైన‌ల్ కాద‌ని తెలుస్తోంది. తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. `తేజ్‌.. ఐ ల‌వ్ యు` అనే టైటిల్‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఫైన‌ల్ చేశార‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఫిక్సే కాబ‌ట్టి త్వ‌ర‌లోనే దానిని అధికారికంగా ప్ర‌క‌టించేస్తార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు క్రియేటివ్ కమ‌ర్షియ‌ల్ కార్యాల‌యం నుంచి అప్‌డేట్ లీకైంది.

తొలి ప్రేమ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని అందించిన క‌రుణాక‌ర‌న్ తొలిసారి సాయిధ‌ర‌మ్ హీరోగా మ‌రో ప్రేమ‌క‌థా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. `ఛాలెంజ్‌`, `అభిలాష‌` వంటి అవార్డు సినిమాల్ని అందించిన కె.ఎస్‌.రామారావు అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. సాయిధ‌ర‌మ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments