అన్నపూర్ణ స్టూడియోలో సినీ పెద్దలతో సమావేశమైన తెలంగాణ మంత్రి…?

Tuesday, February 11th, 2020, 01:22:43 AM IST

తెలుగు సినీ పరిశ్రమకి సంబందించిన పలువురు సినీ పెద్దలని నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యదావ్ కలుసుకున్నారు. కాగా జూబ్లీహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున లతో తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మళ్ళీ భేటీ అయ్యారు. కాగా రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి అవసరమైన చర్యలపై మంత్రి చర్చలు నిర్వహించుకున్నారు. అంతేకాకుండా హోం, రెవెన్యూ, న్యాయ, కార్మికశాఖ అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు.

అయితే సినిమా, టీవీ కళాకారులకు అవసరమైన ఇళ్ల నిర్మాణం కోసం దాదాపుగా 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని చెప్పారు. వాటితో పాటే వివిధ కార్యక్రమాలకు అవసరమైన స్థలాలను కూడా కేటాయించాలని చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుతానికి తలనొప్పిగా మారినటువంటి పైరసీ నివారణకు కూడా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, ఎవరైనా తప్పు చేసి దొరికితే చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కూడా వెల్లడించారు. అయితే వీటన్నింటికి కూడా సరైన ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.