బిగ్ న్యూస్ : చిరుతో కీలక భేటీ..సినిమా షూటింగ్స్ అప్పటి నుంచే.!

Thursday, May 21st, 2020, 02:50:00 PM IST


కరోనా కారణంగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో షూటింగ్స్ సహా అనేక సినిమాల విడుదల ఆగిపోయాయి. దీనితో ఇప్పటికే అనేక నష్టాలు వాటిల్లాయి. దీనితో వీటన్నిటికీ బ్రేక్ వేస్తూ ఒక ఫైనల్ డెసిషన్ తీసుకొంటూ తెలంగాణా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మెగాస్టార్ చిరంజీవి ,నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్,సురేష్ బాబు,సి.కళ్యాణ్,దిల్ రాజు, జెమిని కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకులు రాజమౌళి,వినాయక్, త్రివిక్రమ్ , N. శంకర్, కొరటాల శివ ఇలా మొత్తం 35 మంది పెద్దలతో కలిసి కీలక చర్చలో పాల్గొని ఒక తుది నిర్ణయానికి వచ్చారు.

ఈ సమాచారం ప్రకారం షూటింగ్ లు మరియు థియేటర్ లు ఏ సిస్టం ప్రకారం మొదలుపెట్టాలి అన్నది చర్చించారు అలాగే రేపటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించుకోవచ్చని తెలిపారు.ఇంకా లాక్ డౌన్ పూర్తి కాలేదు అలాగే షూటింగ్స్ కు అనుమతి ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం వారు సినీ పరిశ్రమకు సానుకూలమే అని దీనిపై సీఎం తో కూడా చర్చించి నిర్ణయం ఏమిటి అన్నది మూడు రోజుల్లో కార్యాచరణ చెప్తాము అని తలసాని వెల్లడించారు.