రావురమేశ్‌కి బంఫర్ ఆఫర్.. కేజీఎఫ్-2లో కీలక పాత్ర..!

Monday, February 10th, 2020, 09:51:35 PM IST

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యువ హీరో య‌శ్ హీరోగా తెరకెక్కిన సినిమా కేజీఎఫ్. అక్రమ మైనింగ్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ్, హిందీ భాషలలో కూడా మంచి విజయాన్ని సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి కొన‌సాగింపుగా కేజీఎఫ్ చాప్ట‌ర్ 2ని భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఫస్ట్ పార్ట్‌లో అధీరా అనే పాత్రను సస్పెన్షన్‌లో పెట్టిన మేకర్స్ ఆ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను జూలై 29న విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తెలుగులో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న రావు రమేశ్ ఈ సెకండ్ పార్ట్‌లో నటించే ఆఫర్ కొట్టేశారు. ఒక కీలక పాత్రలో నటించనున్న రావు రమేశ్ ఈ రోజు మూవీ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రావు రమేశ్‌కి స్వాగతం పలుకుతూ మీరు కేజీఎఫ్-2 లో భాగస్వామ్యులు అయినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.