2.0 తో మొదలుపెట్టనున్న “బిజినెస్ మేన్”..?

Friday, November 16th, 2018, 03:47:43 AM IST

తమిళ సూపర్ స్టార్ చిత్రం విడుదలను మన తెలుగు సూపర్ స్టార్ తన కొత్త వ్యాపారంను మొదలు పెట్టడానికి చూస్తున్నట్టు తెలుస్తుంది.ఇంకా అర్ధం కాలేదా.? తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ యొక్క తాజా సినిమా 2.0 చిత్రం ఈ నెల 29 న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది అని అందరికి తెలుసు,అలాగే మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా “ఏ ఎం బి” పేరిట హైదరాబాద్ లోని మల్టీప్లెక్సులు నిర్మిస్తున్నారని కూడా తెలుసు,అంతర్జాతీయ ప్రమాణాలతో మహేష్ ఈ మల్టీప్లెక్సుల ను నిర్మిస్తున్నారు.అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మల్టీప్లెక్సులలో ఏదైనా భారీ స్థాయి చిత్రంతోనే ఆరంభిస్తే బాగుంటుంది అని మహేష్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది.అందుకనే ఈ నెలలో 3D టెక్నాలజీతో తెరకెక్కిన 2.0 చిత్రం అయితే బాగుంటుందని భావించి ఈ చిత్ర విడుదలతోనే ప్రారంభించాలని మహేష్ అనుకుంటున్నారని వార్తలొస్తున్నాయి.