“అల వైకుంఠపురంలో” చిత్రం పై హైప్స్ రావడానికి కారణం అతనేనా?

Sunday, November 17th, 2019, 06:04:55 PM IST

అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం అలా వైకుంఠపురంలో, అయితే ఈ చిత్రంలోని పాటలు ప్రతి ఒక్కరూ కాలర్ టోన్ గా ఉపయోగిస్తున్నారు. యూత్ ఎక్కడ చూసిన సామజవరగమన మరియు రాములో రాములా పాటల్నే వింటున్నారు. అయితే దీనంతటికి కారణం థమన్ అని ఇపుడు చాల మంది అంటున్నారు. మరొకొందరైతే త్రివిక్రమ్ అని అంటున్నారు. అసలు విషయం ఏంటో చూద్దాం.

అరవింద సమేత వీర రాఘవ రెడ్డి చిత్రం తో థమన్ ని త్రివిక్రమ్ మొదటిసారి తీసుకున్నాడు. త్రివిక్రమ్ సినిమాల్లో సంగీతం కూడా చాల ముఖ్యం. అయితే థమన్ ఈ చిత్రానికి ముందు తొలి ప్రేమ చిత్రానికి సంగీతం అందించారు. అది తప్ప ఇప్పట్లో థమన్ కి వున్న మంచి చిత్రాలు లేవని చెప్పాలి. పాటల్ని కాపీ కొడతాడంటూ చాల విమర్శలే వచ్చాయి. అయితే ప్రస్తుతం అలా వైకుంఠపురంలో పాటలు సౌత్ ఇండియా ని షేక్ చేస్తున్నాయి. త్రివిక్రమ్ సినిమా ల వలనే థమన్ కి ఈ సీజ్ వచ్చిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డిస్కో రాజా, ప్రతి రోజూ పండగే, వెంకీ మామ పాటలు పూర్తీ స్థాయిలో విడుదల అయితే తమన్ ఏంటో చెప్పొచ్చు. కానీ విడుదల అయినా పాటలు అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి. అయితే టాలీవుడ్ లో దేవిశ్రీ ప్రసాద్, థమన్ తరువాత రెగ్యులర్ గా సంగీతాన్ని అందించే వారు సినిమా పరిశ్రమ లో లేకపోవడం తో థమన్ కి ఓటేస్తున్నారు దర్శక నిర్మాతలు.