హ్యాట్రిక్ కొట్టాం అంటున్న థమన్

Monday, January 13th, 2020, 10:47:22 PM IST

అల్లు అర్జున్ తో థమన్ ముచ్చటగా మూడో సినిమా పూర్తీ చేసి సంక్రాంతి బరిలో ఉంచాడు, అదే అలా వైకుంఠపురంలో. రేసుగుర్రం చిత్రం తో అల్లు అర్జున్ చిత్రానికి సంగీతం అందించిన థమన్, ఆ తర్వాత సరైనోడు, అలా వైకుంఠపురంలో చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. ఈ మూడు చిత్రాలు బాక్సఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం తో థమన్ తాజాగా సోషల్ మీడియా వేదిక గా ఒక పోస్ట్ పెట్టాడు. అల్లు అర్జున్ తో దిగిన సెల్ఫీ తో హ్యాట్రిక్ అంటూ కాప్షన్ ఇచ్చి గత సినిమా పేర్లని అందులో ఉంచాడు.

సంక్రాంతి పండుగ కానుకగా విడుదల అయిన అలా వైకుంఠపురంలో చిత్రం మొదటిరోజు ఊహించని రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ చిత్రం ప్రేక్షకుల అందరికి నచ్చడమే కాకుండా థమన్, అల్లు అర్జున్ కాంబినేషన్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మరొక హ్యాట్రిక్ కావాలంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ కూడా హ్యాట్రిక్ కొట్టాడని చెప్పాలి. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం చిత్రాలతో వీరు హ్యాట్రిక్ విజయాల్ని సొంతం చేసుకున్నారు.