ప్రభాస్ పుట్టినరోజుకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తాడట థమన్ ?

Sunday, October 14th, 2018, 10:25:18 AM IST

యంగ్ రెబెల్ స్టార్ పుట్టిన రోజుకోసం అయన ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ పుట్టినరోజు సందర్బంగా ఏదైనా న్యూ గిఫ్ట్ ఉంటుందని వారి ఫిలింగ్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ పెట్టారు. శంకర్, ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని పాటలను ఫిబ్రవరి లో విడుదల చేస్తారట. అంతా సరే కానీ ప్రభాస్ పుట్టినరోజుకు థమన్ ఎందుకు గిఫ్ట్ ఇస్తాడు అన్న ఆసక్తి కలిగిందా .. ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా ఓ ప్రత్యేక బీజీఎమ్ ని రెడీ చేయిస్తున్నారట యువి క్రియేషన్స్. ఆ బీజీఎమ్ ని పుట్టినరోజునాడు విడుదల చేస్తారట. అది విషయం. మొత్తానికి ప్రభాస్ ఫాన్స్ కు ఈ బీజీఎమ్ అద్భుతంగా అదిరిపోయేలా ఉందంటూ చెబుతున్నాడు తమన్.