రాఖి సావంత్ పై పదికోట్ల దావా వేసిన తనుశ్రీ ?

Monday, October 22nd, 2018, 09:50:16 PM IST

తాజాగా మీ టూ వ్యవహారం చాలా వేడిగా సాగుతుంది. ఇప్పటికే పలువురు నటీమణులు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా చెబుతుండడంతో నానా రచ్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ తను శ్రీ దత్త నటుడు నానా పాటేకర్ పై చేసిన లైంగిక ఆరోపణలు ఓ రేంజ్ లో సంచలనం క్రియేట్ చేసాయి. నానా పాటేకర్ కు పలువురు మద్దతు ఇచ్చారు .. ఆ లిస్ట్ లో బాలీవుడ్ సెక్సీ బాంబు రాఖీ సావంత్ కూడా తనుశ్రీ దత్త పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. నానా పాటేకర్ చాలా మంచివాడు అంటూ ఆయనను ఆకాశానికి ఎత్తేసింది.

తనుశ్రీ దత్త కేవలం తన ప్రచారం కోసమే ఆమె ఇలాంటి కామెంట్స్ చేస్తుందని చెప్పడంతో .. దానికి రియాక్ట్ అయినా తనుశ్రీ దత్త .. రాఖీ సావంత్ పై 10 కోట్లకు పరువునష్టం దావా వేసింది. తనుశ్రీ దత్త పై రాఖి మాట్లాడుతూ .. సదరు ఆ సినిమా షూటింగ్ లో తనుశ్రీ దత్తా డ్రగ్స్ తీసుకుని మత్తులో పడుకుంది .. ఆ సమయంలో నానా పాటేకర్ సలహాతో నేను ఆ పాటలో నటించానని చెప్పింది. ఆ విషయంలోనే ఆమె మాపై కోపం పెంచుకుందంటూ కామెంట్స్ చేయడంతో తాను శ్రీ దత్త ఫైర్ అయింది.