ఎక్స్‌మెన్‌ యాక్సిడెంట్ మైండ్ బ్లోవింగ్‌!

Saturday, September 29th, 2018, 10:29:00 PM IST

మార్వ‌ల్ సంస్థ ట్వంటీయ‌త్ సెంచ‌రీ ఫాక్స్ సంస్థ‌తో క‌లిసి నిర్మించిన ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ఎక్స్‌మెన్ డార్క్ ఫోనిక్స్` 2019 ఫిబ్రవ‌రిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. లేటెస్టుగా రిలీజైన ట్రైల‌ర్ విజువ‌ల్ గా మెరుపులు మెరిపిస్తోంది. ట్రైల‌ర్ ఆద్యంతం వీఎఫ్ఎక్స్ ఆక‌ట్టుకుంటోంది. ఎక్స్‌మెన్ లాంటి భారీ యాక్ష‌న్ మూవీ సిరీస్‌లో విజువ‌ల్ ఫీస్ట్ ని 3డిలో రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 18.5 ఏళ్లుగా ఎక్స్‌మెన్ సిరీస్‌లో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి.

తాజా చిత్రం ఎక్స్‌మెన్ సిరీస్‌లో చిట్ట‌చివ‌రి సినిమా అని ప్ర‌చార‌మ‌వుతోంది. తాజా ట్రైల‌ర్ రెగ్యులర్ ఎక్స్‌మెన్ త‌ర‌హా కాకుండా కొత్త‌గా ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా ఈ ట్రైల‌ర్‌లో కార్ యాక్సిడెంట్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తోంది. 2019 ఫిబ్ర‌వ‌రిలో రిలీజ‌వుతున్న ఈ చిత్రానికి మెన్ ఇన్ బ్లాక్ – రీబూట్‌, సీక్రెట్ లైఫ్ ఆఫ్ పెట్స్ 2 వంటి క్రేజీ చిత్రాలు పోటీగా దిగుతున్నాయి. 3డి వెర్ష‌న్ సినిమాల‌కు వ‌సూళ్లు పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ చిత్రానికి అంతే క్రేజు నెల‌కొంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.