బన్నీ నెక్స్ట్ సినిమా ఆ విక్రమ్ తో డౌట్..త్రివిక్రమ్ తో ఫిక్స్..!?

Friday, October 26th, 2018, 08:14:28 PM IST

“నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ చిత్రం ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు అన్నది వాస్తవం.అయితే ఆ తర్వాత ఎప్పుడు లేని విధంగా తన తర్వాతి సినిమా మొదలు పెట్టడానికి బన్నీ చాలా సమయాన్నే తీసుకున్నాడు.ఎప్పుడు ఒక చిత్రం చేస్తుండగానే మరో చిత్రానికి సంతకం పెట్టేసేవాడు.తమ హీరో ఎప్పుడు కొత్త చిత్రం మొదలు పెడతాడా అని స్టైలిష్ స్టార్ అభిమానులు ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు.

అప్పట్లో విక్రమ్ కె కుమార్ తో తన చిత్రం రాబోతుందని కూడా ప్రకటన కూడా వచ్చింది కానీ ఆ చిత్రం మాత్రం ఇప్పటివరకు పట్టాలెక్కలేదు.కానీ ఇప్పుడు తాజాగా రేస్ లోకి ఆ విక్రమ్ ను తప్పించి త్రివిక్రమ్ వచ్చినట్టు తెలుస్తుంది.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “జులాయి” మరియు “సన్నాఫ్ సత్యమూర్తి” సినిమాలు అద్భుత విజయాలు సాధించాయి.ఇప్పుడు మళ్ళీ బన్నీ తన మ్యాజిక్ త్రివిక్రమ్ తన లాజిక్ తో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు అన్నట్టుగా వార్తలొస్తున్నాయి.వచ్చే డిసెంబరు నుంచి ఈ చిత్రం మొదలవుతుందని తెలుస్తుంది.ఇప్పటికే “అరవింద సమేత” లాంటి హిట్ తో మళ్ళీ త్రివిక్రమ్ ఈస్ బ్యాక్ అనిపించుకున్నారు.మరి ఈ చిత్రాన్ని ఎలా తెరెకెక్కిస్తారో వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments