అనీల్ కంటే త్రివిక్రమ్ కంటెంటే గొప్పదా..అందుకే ఇలా..?

Friday, November 22nd, 2019, 08:08:20 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల పేర్లు మరియు ఇద్దరు నటిస్తున్న సినిమాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.అయితే ఈ రెండు చిత్రాలను కేవలం ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు అన్న విషయం పక్కన పెడితే దర్శకుల కోసం ఓ సారి మాట్లాడాలి.త్రివిక్రమ్ ఖాతాలో ఘోరమైన ప్లాప్స్ ఉన్నాయి అలాగే భారీ హిట్లు ఉన్నాయి.

అంతే కాకుండా అంతకు మించిన సోల్ తన చిత్రం ద్వారా ప్రతీ ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ చెయ్యడం గురూజీ స్పెషాలిటీ అలాగే సరిలేరు నీకెవ్వరు దర్శకుడు అనీల్ విషయానికి వస్తే ఇప్పటి వరకు తీసిన అన్ని చిత్రాలు కూడా ఒకదాన్ని మించి ఒకటి భారీ హిట్లయ్యాయి.చాలా సింపుల్ కథను ఎన్నుకొని దాన్ని ఎంటర్టైన్మెంట్ కోణంలో తెరకెక్కించి అద్భుతమైన ఫలితాలు ఇప్పటి వరకు రాబట్టారు.

అయితే ఈ రెండు చిత్రాల పైన కూడ ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.కానీ ఈ రెండిట్లో కంటెంట్ పరంగా బలం ఉంది అంటే అది త్రివిక్రమ్ చిత్రానికే అన్న అనుమానం కలుగుతుంది.ఇప్పటికే మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా కథ ఇదే అంటూ ముహూర్తం పెట్టిన రోజునే బయటకు వచ్చేసింది.అనూహ్యంగా ఇప్పటి వరకు కూడా అదే కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దీనిని బట్టి కథ ఇదే అని అందరికీ అర్ధం అయ్యిపోయింది.కానీ త్రివిక్రమ్ స్టోరీ ఏమిటి అన్నది బయటకు రాలేదు.

దానికి తోడు సరిలేరు నీకెవ్వరు స్టోరీ ఇదే అని వారికి తెలిసి ఉండొచ్చు అలా దాని కన్నా వీరి కథలోనే బలం ఉంది కాబట్టి కావాలనే అనీల్ సినిమాతో అల వైకుంఠపురములో టీమ్ పోటీ పడుతూ వస్తుందని చెప్పొచ్చు.దానికి ఉదాహరణగానే ఈరోజు సాంగ్ విడుదల సమయం మార్పు చెయ్యడాన్ని పరిగణించవచ్చు. అందుకే వారు ఇలా కావాలనే టార్గెట్ చేస్తున్నారేమో అన్న అనుమానాలు ఇప్పుడు సినీ వర్గాల్లో రేకెత్తుతున్నాయి.