రజినీ, వెంకీ, పవన్ లకు పెద్ద సవాల్ విసిరిన సూపర్ స్టార్ – ఆందోళనలో అభిమానులు

Wednesday, November 20th, 2019, 01:40:12 AM IST

అలనాటి టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తాజాగా ఒక వినూత్నమైన ప్రయోగాన్ని చేపట్టారు. అదేంటో తెలుసా… తెలంగాణా ఎంపీ సంతోష్ కుమార్ ఇటీవలే గ్రీన్ ఛాలెంజ్ అనే ఒక గొప్ప ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ ఛాలెంజ్ ప్రకారం మూడు మొక్కలు నాటి, మరొకరిని వారిలాగే మొక్కలు నాటడానికి నామినేట్ చేయాలి. అయితే ఈ ప్రక్రియలో భాగంగానే సూపర్ స్టార్ కృష్ణ మొక్కలు నాటి, సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్, పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ లను నామినేట్ చేశారు. కాగా సాధారణంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పచ్చదనాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

అందుకోసమనే ప్రత్యేకంగా ఒక ఫామ్ హౌస్ ని తీసుకోని మరీ అక్కడ అన్ని రకాల మొక్కలు పెంచుతూ, వాటి నుండి వచ్చే ప్రక్రుతి సిద్దమైన సంపదను తన తోటి వారందరికీ కూడా పంచుతుంటాడు. ఇకపోతే రజినీకాంత్ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో కూడా బాగానే కనిపిస్తుంటారు. కాగా ఈ సూపర్ స్టార్ ఇచ్చిన షాక్ తో అభిమానులు అందరు కూడా షాక్ కి గురయ్యారు. అయితే ఈ సవాల్ కి ఈ హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి…