పాతికేళ్లుగా లేడీ టీవీ మొఘ‌ల్ ఏలుబ‌డి!

Friday, June 8th, 2018, 02:56:19 AM IST

ఆవిడ ఏం చేసినా లోకం క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తుంది. అలా జ‌నం నోరెళ్ల‌బెట్టి చూస్తుండ‌గానే ఇంతింతై అన్న చందంగా స్కైని ట‌చ్ చేసింది. టీవీ రంగం.. సినిమా రంగం రెండుచోట్లా త‌న‌దైన స్టైల్లో దూసుకెళ్లిన గ్రేట్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌… ది గ్రేట్ జితేంద్ర కుమార్తె ఏక్తాక‌పూర్ గురించే.. టీవీ కిలాడీ.. టీవీ మొఘ‌ల్ .. హాట్ లేడీ ఎంట‌ర్‌ప్రెన్యూర్ … ఎలా పిలిచినా ప‌లుకుతుంది ఏక్తా.

ఎంచుకున్న రంగం ఏదైనా అక్క‌డ వేడి పుట్టించ‌డం ద్వారా టీఆర్‌పీ గేమ్ ఎలా ఆడాలో ఈ అమ్మ‌డికి తెలిసినంత‌గా ఇంకెవ‌రికీ తెలీదేమో! బోల్డ్ .. డ‌స్కీ.. చిలిపి స్టైల్లో ఏక్తా క‌పూర్ వేసిన ప్ర‌తి వేషం చింపేసింది. ఇంకా చెప్పాలంటే కాసుల కుంభ‌వృష్టి కురిపించింది. సిల్క్‌స్మిత జీవిత‌క‌థ‌తో డ‌ర్టీపిక్చ‌ర్ తీస్తున్న‌ప్పుడు ఒక లేడీ ప్రొడ్యూస‌ర్‌కి ఇదేం పోయేకాలం? అన్నారు. ఆ సినిమా వంద కోట్లు వ‌సూలు చేసింది. ఆ త‌ర‌వాత ఏకంగా ట్రిపుల్ ఎక్స్ తీస్తున్నా అని ప్ర‌క‌టించి సంచ‌ల‌నానికే తెర‌తీసింది. ఇటీవ‌లే లిప్‌స్టిక్ అండ‌ర్ మై బుర్కా.. అంటూ మ‌రో సెన్సేష‌న్‌ని జ‌నాల‌కు చూపించింది. ప‌లు చిత్రాల్లో హార‌ర్ రొమాన్స్ పేరుతో అరిపించే సినిమాలు తీసింది. ఇక బుల్లితెర‌పై అంత‌కంత‌కు వేడి పెంచే నాగిన్ వంటి టీవీ సిరీస్‌ని ర‌న్ చేస్తోంది. యూనివ‌ర్శ్‌లో డైవ‌ర్స్ అంటే ఈవిడే అని చెప్పాలి. స‌రిగ్గా నువ్వు ఏం ఆల‌చిస్తావో దానికి పూర్తి ఆపోజిట్‌గా ఆలోచించి స‌క్సెస్ సాధించ‌డం ఆవిడ స్టైల్‌. ఇంత‌కీ ఈవిడ వ‌య‌సెంతో తెలుసా? ఇంకా టీనేజీ అనుకునేరు! హ‌మ్మ‌మ్మ‌!! నేడు 43వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంది. పాతికేళ్లుగా ఇండ‌స్ట్రీని ఏల్తూనే ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments