వెండితెర దృశ్య‌కావ్యం.. ‘మ‌హాన‌టి’కి అరుదైన గౌర‌వం..!

Thursday, November 1st, 2018, 09:23:25 AM IST

వెండితెర ఇల‌వేల్పు సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన మాహాన‌టి చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ సావిత్రి పాత్ర‌లో జీవించేయ‌డంతో.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకుంది మ‌హాన‌టి. అల‌నాటి సావిత్రి జీవిత క‌థ కావ‌డంతో ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇక మ‌హ‌న‌టి అవార్డులు కూడా కొల్ల‌గొట్ట‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డ్డారు. అయితే తాజాగా మ‌రోసారి ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే మ‌హాన‌టి చిత్రానికి అరుదైన ద‌క్కింద‌ని సమాచారం. ఇండియ‌న్ ప‌నోర‌మాలో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ నుండి ప్ర‌ద‌ర్శ‌న కోసం మ‌హాన‌టి చిత్రం ఎంపికైంది. 49వ‌ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ ఎఫ్ ఐ) ఉత్స‌వాలు త్వ‌ర‌లో గోవాలో జ‌ర‌గ‌నున్నాయి. అందులో భాగంగా మ‌హాన‌టిని ప్ర‌ద‌ర్శిస్తారని స‌మాచారం. హిందీ, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం.. ఇలా దేశంలోని అన్ని ప్రాంతాల భాష‌ల నుంచి దాదాపు 22 చిత్రాలు ఈ చిత్రోత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌కు చోటు సంపాదించాయ‌ని తెలుస్తోంది. ఇక తెలుగు నుంచి ఆ గౌర‌వం మ‌హాన‌టికి మాత్ర‌మే ద‌క్కింద‌ని.. దీంతో తెలుగు సినిమా ఖ్యాతి మ‌రో మెట్టు ఎక్కింద‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో మ‌హాన‌టి సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టించ‌గా.. రాజేంద్ర‌ప్ర‌సాద్, స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్, విజ‌య‌దేవ‌ర కోండ త‌దిత‌రులు న‌టించారు. వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమాస్ సంయుక్తంగా తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని, నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

  •  
  •  
  •  
  •  

Comments