40 మంది హీరోయిన్లతో..కామాంధుడికి కేరాఫ్ అడ్రస్..!

Sunday, October 15th, 2017, 11:03:38 AM IST

హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హార్వే వైన్ స్టైన్ కీచక పర్వాలు తవ్వే కొద్దీ బయట పడుతున్నాయి. అనేక హాలీవుడ్ చిత్రాలకు నిర్మాతగా ఓ వెలుగు వెళ్లిన హార్వే పెద్ద మనిషి అనే మాటకు మచ్చ తీసుకుని వచ్చాడు. ప్రముఖ తార ఏంజెలినా జోలీ వంటి వారు నోరు విప్పడంతో హార్వే కామ కలాపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. హీరోయిన్ల సినీ అవసరాలని వారి బలహీనతల్ని ఆసరాగా చేసుకుని హార్వే లైగిక వేధింపులకు గిరిచేసిన సంఘటనలు ఆధారాలతో సహా స్పష్టంగా బయట పడ్డాయి. దీనితో ప్రపంచం మొత్తం అతడిపై దుమ్మెత్తి పోస్తోంది. కేవలం హాలీవుడ్ హీరోయిన్లే కాదు.. ఐశ్వర్యారాయ్ వంటి మన ఇండియన్ తరాలపై కూడా ఈ అపర కీచకుడు కన్నేసినట్లు తేలింది.

ఏంజెలినా జోలీ, లియా సిడాక్స్, గనైత్ ఫాల్ట్రో ఇలా చెప్పుకుంటూ పోతే ఇతగాడి చెరలో పడ్డవారంతా ప్రముఖ హీరోయిన్లే. లైగికంగా వేధించడం.. ఒప్పుకోకుంటే బెదిరింపులకు పాల్పడడం.. 1990 నుంచి చాటుమాటుగా ఇతగాడు చేస్తున్న వ్యవహారం ఇదే. ఇతగాడి భయానికి బయట పడని హీరోయిన్లు ఇంకా పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. 90 దశకం మొదలుకుని ఇప్పటివరకు 40 మంది ప్రముఖ హీరోయిన్లని లైంగిక వేధింపులకు గురిచేసినట్లు తేలింది